AP News: రాష్ట్ర వ్యాప్తంగా అదనపు బలగాలు మోహరించాం: డీజీపీ

తాజా వార్తలు

Published : 19/10/2021 20:56 IST

AP News: రాష్ట్ర వ్యాప్తంగా అదనపు బలగాలు మోహరించాం: డీజీపీ

అమరావతి: తెదేపా కార్యాలయంపై దాడులకు పాల్పడిన వారిపై కఠినన చర్యలు తీసుకుంటామని ఏపీ డీజీపీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు సంయమనం పాటించాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు. ‘‘రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ప్రజలు ఆవేశానికి లోనుకావొద్దు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోవద్దు. రాష్ట్ర వ్యాప్తంగా అదనపు బలగాలను మోహరించాం’’ అని డీజీపీ కార్యాలయం తెలిపింది.

తెదేపా కార్యాలయాలు, ఆపార్టీ నేతల నివాసాలపై దాడుల నేపథ్యంలో  తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయం వద్ద భద్రతను పెంచారు. స్పెషల్‌ పార్టీ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. తెదేపా కేంద్ర కార్యాలయం వద్ద 200 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని