బంగాళాఖాతంలో భూకంపం.. ఏపీలో పలుచోట్ల ప్రకంపనలు

తాజా వార్తలు

Updated : 24/08/2021 20:15 IST

బంగాళాఖాతంలో భూకంపం.. ఏపీలో పలుచోట్ల ప్రకంపనలు

అమరావతి: బంగాళాఖాతంలో కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.1గా నమోదు అయినట్టు నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ సెంటర్ (ఎన్జీఆర్‌ఐ) ప్రకటించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు తీర ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలుకు 257 కిలోమీటర్ల దూరంలోని సముద్ర గర్భంలో ఈ భూకంపం సంభవించినట్లు తెలియజేసింది. సముద్ర గర్భం నుంచి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు ఎన్జీఆర్‌ఐ తెలిపింది. కాకినాడ నుంచి ఆగ్నేయంగా 296 కిలోమీటర్లు, రాజమండ్రి నుంచి 312 కిలోమీటర్లు, పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురానికి 260 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు ప్రకటించింది. రెండు సెకన్ల పాటు భూ ప్రకంపనలు నమోదు అయినట్టు శాస్త్రవ్రేత్తలు వెల్లడించారు. ప్రకంపనల స్థాయి తక్కువగా ఉండటంతో ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని ఎన్జీఆర్‌ఐ స్పష్టం చేసింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని