Engineering: ఇంజినీరింగ్‌ మొదటి విడతలో 60,941 సీట్ల కేటాయింపు

తాజా వార్తలు

Published : 18/09/2021 17:48 IST

Engineering: ఇంజినీరింగ్‌ మొదటి విడతలో 60,941 సీట్ల కేటాయింపు

హైదరాబాద్‌: తెలంగాణలో ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభమయ్యింది. మొదటి విడతలో 82.24 శాతం ఇంజినీరింగ్‌ సీట్లను కేటాయించినట్లు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ తెలిపారు. బీటెక్‌కు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 60,941 సీట్లను భర్తీ చేశామన్నారు. మొదటి విడత కేటాయింపు అనంతరం కన్వీనర్‌ కోటాలో ఇంకా 13,130 సీట్లు మిగిలిపోయాయని స్పష్టం చేశారు. ఈడబ్ల్యూఎస్‌ కోటాలో 5,108 సీట్లను కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. 31 ఇంజినీరింగ్‌ కాలేజీల్లో తొలి విడతలోనే సీట్లన్నీ భర్తీ అయ్యాయన్నారు. ఫార్మా కోర్సుల్లో ఎంపీసీ అభ్యర్థుల కోటాకు స్పందన తగ్గిందని పేర్కొన్నారు. బీఫార్మసీలో 4,199, ఫార్మ్‌ డీ సీట్లలో కేవలం 228 భర్తీ అయ్యాయని పేర్కొన్నారు. ఈనెల 23లోపు ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలని విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ విద్యార్థులకు సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని