Viveka murder case: రంగన్నతో నాకు పరిచయం లేదు: ఎర్రగంగిరెడ్డి

తాజా వార్తలు

Updated : 24/07/2021 13:03 IST

Viveka murder case: రంగన్నతో నాకు పరిచయం లేదు: ఎర్రగంగిరెడ్డి

కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న ఆయన ప్రధాన అనుచరుడు ఎర్రగంగిరెడ్డి.. హత్య జరిగిన సమయంలో వివేకా ఇంటి వాచ్‌మెన్‌గా ఉన్న రంగన్న చేసిన ఆరోపణలపై స్పందించారు. రంగన్నతో తనకు పరిచయమే లేదని చెప్పారు. తానెవరినీ బెదిరించలేదని తెలిపారు. తాను బెదిరించినట్లు కడప, పులివెందులలో ఎక్కడా కేసులు లేవన్నారు. వివేకాకు తాను ద్రోహం చేసే వ్యక్తిని కాదని.. వివేకా హత్య కేసులో తనకు ప్రమేయం లేదని ఎర్రగంగిరెడ్డి వివరించారు.

‘ఎవరికైనా నా పేరు చెబితే నిన్ను నరుకుతా’ అంటూ ఎర్ర గంగిరెడ్డి తనను బెదిరించారని రంగన్న అలియాస్‌ రంగయ్య తెలిపారు. అందుకే తాను భయపడి ఏమీ చెప్పలేదన్నారు. తనపై ఈగ వాలనివ్వబోమని సీబీఐ అధికారులు చెప్పారన్నారు. జమ్మలమడుగు న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చిన తర్వాత శుక్రవారం రాత్రి పులివెందులకు చేరుకున్న ఆయన కొంతమంది స్థానికులు, విలేకర్లతో మాట్లాడారు. ఆ వీడియోలు వైరల్‌ అయ్యాయి. న్యాయమూర్తి ఎదుట ఏం చెప్పారని అడగ్గా, తనకు భయం వేస్తోందని రంగన్న సమాధానమిచ్చారు. భయపడాల్సిన పనిలేదని పదే పదే ప్రశ్నించగా అక్కడున్నవారి చెవిలో ఎర్ర గంగిరెడ్డి, వివేకా పాత డ్రైవర్‌ దస్తగిరి, సునీల్‌కుమార్‌ పేర్లను చెప్పారు. ఎవరితోనూ ఏమీ చెప్పొద్దని, ఏం అడిగినా ఏమీ తెలియదని సమాధానం చెప్పాలంటూ తనకు సీబీఐ అధికారులు సూచించారని వివరించారు. అయితే, అంతకుముందు మాత్రం అసలు న్యాయమూర్తితో ఏం చెప్పానో తనకు గుర్తులేదని రంగన్న చెప్పిన విషయం తెలిసిందే. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని