AP News: పూజలు చేస్తూ కొండపై నుంచి జారి పడి పూజారి మృతి

తాజా వార్తలు

Updated : 21/08/2021 13:56 IST

AP News: పూజలు చేస్తూ కొండపై నుంచి జారి పడి పూజారి మృతి

శింగనమల: అనంతపురం జిల్లా శింగనమల మండలం గంపమల్లయ్యస్వామి కొండపై విషాదం చోటు చేసుకుంది. గంపమల్లయ్య కొండపై నుంచి పూజారి పాపయ్య సుమారు 40 అడుగుల కిందకు జారిపడి మృతి చెందారు. స్వామివారికి పూజలు చేస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడటంతో ఈ ఘటన జరిగింది. ఎత్తైన కొండల మధ్య గంపమల్లయ్య స్వామి కొలువై ఉంటారు.

ఏటా శ్రావణమాసంలో ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఎలాంటి ఆధారం లేకుండా కొండపై నుంచి కిందకి దిగి పూజ చేయడం ఇక్కడి ప్రత్యేకత. ఈ క్రమంలో పూజలు నిర్వహిస్తుండగా పూజారి ప్రమాదవశాత్తు కొండపై నుంచి పడి మృతి చెందడం అక్కడ ఉన్న భక్తుల్లో విషాదం నింపింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని