Saidabad: సైదాబాద్‌ ఘటన.. నిందితుడి మృతిపై హైకోర్టులో పిల్‌

తాజా వార్తలు

Published : 17/09/2021 11:09 IST

Saidabad: సైదాబాద్‌ ఘటన.. నిందితుడి మృతిపై హైకోర్టులో పిల్‌

హైదరాబాద్‌: నగరంలోని సైదాబాద్‌ హత్యాచార ఘటనలో నిందితుడిగా ఉన్న పల్లకొండ రాజు మృతిపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్‌ దీన్ని దాఖలు చేశారు. రాజుది కస్టోడియల్‌ మృతిగా అనుమానం ఉందని పిటిషనర్‌ పేర్కొన్నారు. దీనిపై మధ్యాహ్నం ఒంటిగంటకు హైకోర్టు విచారణ చేపట్టనుంది.

సైదాబాద్‌ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి చంపేసిన నిందితుడు రాజు గురువారం స్టేషన్‌ ఘన్‌పూర్‌ సమీపంలో రైల్వే ట్రాక్‌పై మృతిచెందాడు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు భారీగా గాలిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ నేపథ్యంలో పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు ఉన్నత న్యాయస్థానంలో పిల్‌ దాఖలు చేశారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని