Ts News: 50 కోర్సులకు సీపీగెట్ నిర్వహణ.. ఫలితాల్లో సత్తా చాటిన అమ్మాయిలు

తాజా వార్తలు

Updated : 21/10/2021 22:15 IST

Ts News: 50 కోర్సులకు సీపీగెట్ నిర్వహణ.. ఫలితాల్లో సత్తా చాటిన అమ్మాయిలు

హైదరాబాద్‌: పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షల ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. ఉత్తీర్ణులైన వారిలో 64 శాతం అమ్మాయిలే ఉన్నారు. ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, జేఎన్ టీయూహెచ్‌ వర్సిటీల్లో సంప్రదాయ పీజీ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన సీపీగెట్ ఫలితాలను ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి విడుదల చేశారు. సీపీగెట్‌లో 92.51 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 50 కోర్సుల కోసం నిర్వహించిన సీపీగెట్‌లో 63,748 మంది ఉత్తీర్ణులు కాగా.. వారిలో అమ్మాయిలు 41,131, అబ్బాయిలు 22,614 మంది ఉన్నారు. ఆరు యూనివర్సిటీల్లో కలిపి 41,174 సీట్లు ఉన్నట్లు సీపీగెట్‌ కన్వీనర్ పాండురంగారెడ్డి తెలిపారు. ఈ నెల 24 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని లింబాద్రి తెలిపారు.

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో పీజీ కోర్సుల్లో ఫీజులు పెరగనున్నాయని.. ఇప్పటికే పాలక మండలి ఆమోదించిందని వర్సిటీ వీసీ రవీందర్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో ఒకే విధమైన ఫీజు ఉండేలా కసరత్తు జరుగుతోందన్నారు. అందులో భాగంగా ఓయూలో ఫీజులు పెంచనున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీని వల్ల విద్యార్థులపై ఎలాంటి భారం ఉండదని.. ఫీజురీయింబర్స్‌మెంట్‌ పరిమితిలోనే పెరుగుతాయని వీసీ స్పష్టం చేశారు. ఓయూలో విద్యార్థినుల వసతి గృహాల సంఖ్య పెంచుతామన్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని