AP News: దుర్గమ్మ సేవలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ దంపతులు

తాజా వార్తలు

Updated : 07/10/2021 12:03 IST

AP News: దుర్గమ్మ సేవలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ దంపతులు

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మను గవర్నర్‌ బిశ్వభూషణ్‌ దంపతులు దర్శించుకున్నారు. గవర్నర్ దంపతులకు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారికి గవర్నర్‌ తొలిపూజలు చేశారు. నవరాత్రుల్లో అమ్మవారి దర్శనం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజల ఉపశమనం పొందాలన్నారు. కరోనా నుంచి విముక్తి కలగాలని దుర్గమ్మను ప్రార్థించినట్లు చెప్పారు. దసరా ఉత్సవాలను ప్రజలంతా ఆనందంగా జరుపుకోవాలన్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. గవర్నర్‌ తొలిపూజతో దుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారు భక్తులకు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా దర్శనమిస్తున్నారు. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని