Hyderabad News: గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు మాతృవియోగం

తాజా వార్తలు

Updated : 18/08/2021 09:05 IST

Hyderabad News: గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు మాతృవియోగం

హైదరాబాద్‌: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మాతృమూర్తి కృష్ణకుమారి(80) కన్నుమూశారు. నిన్న తీవ్ర అస్వస్థతకు గురైన కృష్ణకుమారిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమె ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. గవర్నర్‌ తమిళిసై తల్లి మృతి చెందడం పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. గవర్నర్‌ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేసీఆర్‌తో పాటు రాష్ట్ర మంత్రులు కృష్ణకుమారి మృతి పట్ల సంతాపం ప్రకటించారు. 

బండి సంజయ్, రేవంత్‌రెడ్డి సంతాపం..

గవర్నర్‌ మాతృమూర్తి మృతి పట్ల భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని