GRMB: గెజిట్‌ అమలు కార్యాచరణపై జీఆర్‌ఎంబీ ఉపసంఘం భేటీ

తాజా వార్తలు

Published : 20/09/2021 22:27 IST

GRMB: గెజిట్‌ అమలు కార్యాచరణపై జీఆర్‌ఎంబీ ఉపసంఘం భేటీ

హైదరాబాద్: కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ అమలు కార్యాచరణపై గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) మరోమారు చర్చించింది. జీఆర్ఎంబీ సభ్యకార్యదర్శి బీపీ పాండే నేతృత్వంలో జరిగిన సమావేశంలో బోర్డు సభ్యులు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారులు పాల్గొన్నారు. శుక్రవారం నాటి సమావేశానికి కొనసాగింపుగా ఈ భేటీ జరిగింది. ప్రాజెక్టులు, పంప్ హౌజులు, ప్లాంట్లకు సంబంధించిన ఉద్యోగులు, సిబ్బంది వివరాలు వీలైనంత త్వరగా ఇవ్వాలని రెండు రాష్ట్రాలను ఉపసంఘం కోరింది. అక్టోబర్ 14వ తేదీ నుంచి గెజిట్ నోటిఫికేషన్‌ అమలు చేయాల్సి ఉన్నందున వీలైనంత త్వరగా వివరాలు అందించాలని సూచించింది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలంగాణ అధికారులు ఉపసంఘానికి తెలిపారు. నిర్వహణ కోసం సిబ్బంది, మౌలిక వసతుల వివరాలు అందిస్తామని ఏపీ అధికారులు చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని