Ts News: గులాబ్‌ తుపాను ప్రభావం.. అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ

తాజా వార్తలు

Published : 28/09/2021 21:16 IST

Ts News: గులాబ్‌ తుపాను ప్రభావం.. అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ

హైదరాబాద్‌: గులాబ్‌ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో రాష్ట్రంలో అంటువ్యాధులు, నీటిసంబంధిత వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని జిల్లాల అధికారులను వైద్యారోగ్య శాఖ ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు (డీహెచ్‌) డా.శ్రీనివాసరావు జిల్లాల వైద్యారోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డీఎంహెచ్ఓలు, అన్ని స్థాయిల్లోని అధికారులు, వైద్య సిబ్బంది వారివారి హెడ్ క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండాలన్నారు. ముందస్తు అనుమతి లేకుండా ఎవరికీ సెలవులు ఇవ్వొద్దని స్పష్టం చేశారు. జిల్లాల్లో జ్వరాలు ఉన్న ప్రాంతాల్లో తరచుగా ఫీవర్ సర్వే నిర్వహించడంతో పాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రత్యేకించి వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటువ్యాధులు, నీటిసంబంధిత వ్యాధులు ప్రబలకుండా డీఎంహెచ్‌ఓలు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అధికారులు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది తమ పరిధిలో క్షేతస్థాయిలో పర్యటించేలా చూడాలని.. విష జ్వరాలు, వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని