Ts News: భాగ్యనగరంలో భారీ వర్షం

తాజా వార్తలు

Updated : 18/07/2021 19:15 IST

Ts News: భాగ్యనగరంలో భారీ వర్షం

హైదరాబాద్: భాగ్యనగరంలో ఆదివారం భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో దాదాపు గంటన్నర పాటు ఎడతెరపిలేకుండా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మాదాపూర్‌, పంజాగుట్ట, నాంపల్లి, ఖైరతాబాద్, సికింద్రాబాద్‌, కూకట్‌పల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్-బంజారాహిల్స్ రహదారిపై మోకాళ్ల లోతు నీళ్లు నిలిచాయి. ఇంజిన్‌లోకి నీరు చేరి రెండు కార్లు రహదారికి అడ్డంగా ఆగిపోవడంతో లక్డీకాపూల్‌ వరకు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. బాలానగర్, చింతల్, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, కుత్బుల్లాపూర్, కొంపల్లి, కోఠి, సుల్తాన్ బజార్, బేగంబజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణ గూడ, ట్యాంక్ బండ్‌ ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.

మరిన్ని ఫొటోల కోసం క్లిక్‌ చేయండి



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని