Helicopter: విశాఖ యారాడ దర్గా సమీపంలో గాల్లో హెలికాప్టర్‌ చక్కర్లు

తాజా వార్తలు

Updated : 27/08/2021 16:29 IST

Helicopter: విశాఖ యారాడ దర్గా సమీపంలో గాల్లో హెలికాప్టర్‌ చక్కర్లు

విశాఖ: నగరంలోని యారాడ వద్ద ఓ హెలికాప్టర్‌ గాల్లో చాలా సేపు చక్కర్లు కొట్టింది. సాంకేతికలోపంతో యారాడ దర్గాకు అత్యంత సమీపంలో దాదాపు 40 నిమిషాలపాటు చక్కర్లు కొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. అనంతరం నేవీ బేస్‌ వద్ద ముళ్ల పొదల్లో కూలిపోయి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. హెలికాప్టర్‌ యారాడ దర్గా సమీపంలో అతి తక్కువ ఎత్తులోనే చక్కర్లు కొట్టడంతో అక్కడ ఉన్న కొన్ని చెట్లు నాశనమయ్యాయి. ఎక్కువ సమయం హెలికాప్టర్‌ చక్కర్లు కొట్టడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

ఈ హెలికాప్టర్ ఏ విభాగానికి చెందినదన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు అది తమ హెలికాప్టర్ కాదని నేవీ అధికారులు ధ్రువీకరించారు. నేవీ అధికారులు స్పష్టత ఇవ్వడంతో హెలికాప్టర్‌ ఎక్కడి నుంచి వచ్చిందన్న అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. కోస్ట్‌ గార్డుకు చెందినదా? లేక ఇతర విభాగాలకు చెందినదా? అనే అంశంపై విచారణ చేపట్టారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని