Ts news: ప్రతీ ఏడాది చర్యలు తీసుకోవాలని కోర్టు చెప్పాలా?: సర్కార్‌పై హైకోర్టు అసహనం

తాజా వార్తలు

Published : 21/09/2021 21:29 IST

Ts news: ప్రతీ ఏడాది చర్యలు తీసుకోవాలని కోర్టు చెప్పాలా?: సర్కార్‌పై హైకోర్టు అసహనం

హైదరాబాద్‌: డెంగీ వంటి సీజనల్ వ్యాధుల నియంత్రణకు ఆచరణ సాధ్యమయ్యే కార్యాచరణ ప్రణాళికలు సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. డెంగీ నియంత్రణ చర్యలు చేపట్టడం లేదన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ టి.వినోద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. వర్షాకాలంలో దోమల వ్యాప్తి వల్ల జ్వరాలు ప్రబలుతాయని తెలిసినప్పటికీ.. చర్యలు తీసుకోవాలని ప్రతీ ఏడాది కోర్టు చెప్పాలా? అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన కమిటీ ఇప్పటివరకు ఎన్నిసార్లు సమావేశమైందో తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో విషజ్వరాల నియంత్రణపై ఇటీవల ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారని ఏజీ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. ఇలాంటి విషయాల్లో కూడా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎందుకు చెప్పాలని.. అధికార యంత్రాంగం ఎందుకు చర్యలు తీసుకోకూడదని ప్రశ్నించింది. సమస్యను తీవ్రంగా పరిగణించి స్థానిక సంస్థలు, వైద్యారోగ్య శాఖతో సమన్వయం చేసుకొని నివారణ చర్యలు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించింది. ఆచరణ సాధ్యమయ్యే ప్రణాళిక ఈనెల 25లోగా సమర్పిస్తే.. ఈనెల 29నాటికి ఆదేశాలు జారీ చేస్తామని ధర్మాసనం తెలిపింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని