Ap News: ఉపాధి హామీ పెండింగ్‌ బిల్లులు.. విచారణకు హాజరైన ఐఏఎస్ అధికారులు

తాజా వార్తలు

Published : 22/09/2021 16:49 IST

Ap News: ఉపాధి హామీ పెండింగ్‌ బిల్లులు.. విచారణకు హాజరైన ఐఏఎస్ అధికారులు

హైదరాబాద్: ఉపాధి హామీ పథకం పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరిపింది. ఐఏఎస్ అధికారులు ఎస్ఎస్ రావత్, గిరిజా శంకర్, గోపాలకృష్ణ ద్వివేది విచారణకు హాజరయ్యారు. 60 శాతం పనులకు డబ్బులు చెల్లించామని.. 40 శాతం పనులకు చెల్లించాల్సి ఉందని న్యాయస్థానానికి అధికారులు వివరించారు. రూ.400 కోట్ల మేర బిల్లుల ప్రతిపాదనలు సెప్టెంబర్ 18న రాష్ట్ర ప్రభుత్వం పంపిందని.. వాటిని పరిశీలించి ఈ నెలాఖరులోగా చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. కొన్ని చోట్ల నగదు వచ్చినా పంచాయతీ సర్పంచ్‌లు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించట్లేదని పిటిషనర్ తరపు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఏడు రోజుల్లోగా బిల్లులు చెల్లించాలని పంచాయతీలకు ఆదేశాలిచ్చామని.. బిల్లులను చెల్లించకపోతే చర్యలు తీసుకుంటాని ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 7కు వాయిదా వేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని