బిల్‌గేట్స్ ఇంట పెళ్లి సందడి.. ఫొటోలు చూస్తారా..!

తాజా వార్తలు

Published : 20/10/2021 01:09 IST

బిల్‌గేట్స్ ఇంట పెళ్లి సందడి.. ఫొటోలు చూస్తారా..!

వాషింగ్టన్‌: వారాంతంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ఇల్లు పెళ్లి వేడుకలతో కళకళలాడింది. శనివారం బిల్‌, మిలిందా గేట్స్‌ల పెద్ద కుమార్తె జెన్నిఫర్ క్యాథరీన్ వివాహ వేడుక జరిగింది. ఆమె ఈజిప్టుకు చెందిన ఈక్వెస్ట్రియన్ నాయెల్ నాజర్‌ను వివాహం చేసుకున్నారు. న్యూయార్క్‌లోని గేట్స్ కుటుంబానికి చెందిన ఫార్మ్‌హౌస్‌ ఈ వేడుకకు వేదికైంది. ఇప్పుడు నెట్టింట్లో దర్శనమిచ్చిన ఆ జంట ఫొటోలు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. 

జెన్నిఫర్, నాయెల్ స్టాన్‌ఫోర్డ్‌లో విద్యాభ్యాసాన్ని పూర్తిచేశారు. 2017లో ఈక్వెస్ట్రియన్‌ సర్క్యూట్‌లో కలుసుకున్న ఈ ఇద్దరూ.. ప్రేమలో పడ్డారు. గత సంవత్సరం ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. నాయెల్ ఈ ఏడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో పోటీ పడిన సంగతి తెలిసిందే. బిల్‌, మిలిందా గేట్స్ తమ ట్విటర్ ఖాతాల్లో వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని