kadapa news: వివేకా కుమార్తె సునీత లేఖపై స్పందించిన ఎస్పీ

తాజా వార్తలు

Published : 14/08/2021 01:10 IST

kadapa news: వివేకా కుమార్తె సునీత లేఖపై స్పందించిన ఎస్పీ

కడప: తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని, వెంటనే భద్రత కల్పించాలని కోరుతూ మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీత రాసిన లేఖపై కడప ఎస్పీ అన్బురాజన్‌ స్పందించారు. సునీత ఇంటి వద్ద వెంటనే పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆమె లేఖలో పేర్కొన్న ఇతర అంశాలపైనా విచారణ చేయాలని ఎస్పీ ఆదేశించారు. విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని డీఎస్పీ స్థాయి అధికారిని ఆదేశించారు.

ఈనెల 10న పులివెందులలోని తమ నివాసం వద్ద మణికంఠరెడ్డి అనే వ్యక్తి రెక్కీ నిర్వహించాడని సునీత ఫిర్యాదులో పేర్కొన్నారు. మణికంఠరెడ్డి వైకాపా నాయకుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి అనుచరుడిగా ఆమె వివరించారు. తన తండ్రి హత్యకేసులో శివశంకర్‌రెడ్డి ప్రధాన అనుమానితుడిగా ఉన్నారని, ఇప్పుడు అతని అనుచరుడు రెక్కీ నిర్వహించడం పలు అనుమానాలకు తావిస్తోందని ఆమె లేఖలో పేర్కొన్నారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా అనుమానితుడిని గుర్తించామని, వెంటనే చర్యలు తీసుకోవడంతో పాటు తమ కుటుంబానికి భద్రత కల్పించాలని జిల్లా ఎస్పీ, డీజీపీ, సీబీఐ అధికారులకు సునీత లేఖలు పంపారు. లేఖతో పాటు సీసీ కెమెరా దృశ్యాల పెన్‌డ్రైవ్‌లు కూడా పంపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని