CM KCR: పోలీస్‌ అమరులు సేవలను జాతి మరవదు: కేసీఆర్‌ 

తాజా వార్తలు

Updated : 21/10/2021 12:02 IST

CM KCR: పోలీస్‌ అమరులు సేవలను జాతి మరవదు: కేసీఆర్‌ 

హైదరాబాద్‌: పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో అమరులైన వారికి సీఎం కేసీఆర్‌ నివాళులర్పించారు. వారి సేవలను స్మరించుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాణాలొడ్డి పోరాడిన పోలీస్‌ అమరుల సేవలు జాతి ఎన్నటికీ మరువదన్నారు. అమరవీరుల స్ఫూర్తితో పోలీసులు తమ విధి నిర్వహణకు పునరంకితం కావాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. అమరులైన పోలీస్‌ కుటుంబాలను ఆదుకునేందుకు వారి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సీఎం గుర్తు చేశారు.

మరోవైపు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యాగాలను రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌శాఖ స్మరించుకుంది. హైదరాబాద్‌లో హోంమంత్రి మహమూద్‌ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ‘‘రాష్ట్రంలో పోలీస్‌ సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. కరోనా సమయంలో చనిపోయిన పోలీసులకు సర్కారు అండగా ఉంటుంది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన బోనాలు, రంజాన్ పండుగలను ప్రశాంతంగా నిర్వహించాం. మహిళల భద్రతకు భరోసా సెంటర్ల ఏర్పాటు చేసి వారికి అండగా ఉంటున్నాం’’ హోంమంత్రి వివరించారు.

‘‘ప్రభుత్వం చొరవతో పోలీసు వ్యవస్థ బలపడింది. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొవిడ్ సమయంలో పోలీసులు అత్యుత్తమ సేవలు అందించారు. ప్రభుత్వ సహకారంతో నేరరహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం’’ అని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని