Khairtabad Ganesh: ఖైరతాబాద్‌ గణేశ్‌ నిమజ్జనంపై ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం

తాజా వార్తలు

Updated : 14/09/2021 20:05 IST

Khairtabad Ganesh: ఖైరతాబాద్‌ గణేశ్‌ నిమజ్జనంపై ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం

హైదరాబాద్: వినాయక నిమజ్జనంపై ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి మండపంలోనే ఖైరతాబాద్‌ గణేశ్‌ విగ్రహ నిమజ్జనం చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది నుంచి మట్టి వినాయక విగ్రహం పెట్టాలని కమిటీ నిర్ణయించింది. వచ్చే సంవత్సరం 70 అడుగుల మట్టి వినాయక విగ్రహాన్ని కమిటీ ప్రతిష్ఠించనుంది. మండపంలోనే నిమజ్జనం చేయాలనే నిర్ణయాన్ని వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలని కమిటీ తీర్మానించింది.

మరోవైపు హుస్సేన్‌ సాగర్‌లో గణేశ్‌ నిమజ్జనంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. హుస్సేన్‌ సాగర్‌లో ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాల నిమజ్జనం చేయొద్దని హైకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. నిమజ్జనం విషయంలో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. రేపు ఉదయం సీజేఐ ధర్మాసనం ఎదుట ప్రభుత్వం.. నిమజ్జనం అంశాన్ని ప్రస్తావించనుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని