Rayalaseema lift irrigation: రాయలసీమ ఎత్తిపోతలపై కృష్ణా బోర్డు మధ్యంతర నివేదిక

తాజా వార్తలు

Published : 08/08/2021 17:10 IST

Rayalaseema lift irrigation: రాయలసీమ ఎత్తిపోతలపై కృష్ణా బోర్డు మధ్యంతర నివేదిక

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ)కు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు మధ్యంతర నివేదిక సమర్పించింది. రాయలసీమ ఎత్తిపోతలపై పూర్తి స్థాయి నివేదిక సమర్పించేందుకు మూడు వారాల గడువు కావాలని ఎన్జీటీని బోర్డు కోరింది. రాయలసీమ ఎత్తిపోతల పరిశీలనకు వచ్చే బృందంలో తెలంగాణకు చెందిన వారు ఎవరూ ఉండకూడదని ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు సూచించిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల వారు లేకుండా చూడాలని ఎన్జీటీ సైతం కృష్ణా బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో రాయలసీమ ఎత్తిపోతల పరిశీలన బృందంలో తెలంగాణకు చెందిన దేవేందర్ రావు ఉండటంపై ఏపీ సర్కార్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. దేవేందర్‌ స్థానంలో మరో వ్యక్తిని నామినేట్‌ చేయాలని కేంద్ర జల్‌శక్తి శాఖను కోరినట్లు బోర్డు తెలిపింది. నామినేట్‌ చేసిన వెంటనే ఓ బృందాన్ని ఏర్పాటు చేసి ఎత్తిపోతల పరిశీలనకు వెళ్తామని బోర్డు స్పష్టం చేసింది. అనంతరం పూర్తి స్థాయి నివేదిక సమర్పిస్తామని ఎన్జీటీకి తెలిపింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని