కేఆర్‌ఎంబీ రాయలసీమ ఎత్తిపోతల పరిశీలన వాయిదా

తాజా వార్తలు

Updated : 04/08/2021 20:27 IST

కేఆర్‌ఎంబీ రాయలసీమ ఎత్తిపోతల పరిశీలన వాయిదా

హైదరాబాద్‌: కృష్ణానది యాజమాన్యబోర్డు  (కేఆర్‌ఎంబీ) రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల పరిశీలన వాయిదా పడింది. ఎన్జీటీ ఆదేశాల నేపథ్యంలో పర్యటన వాయిదా పడిందని అధికారులు వెల్లడించారు. పథకం పరిశీలన తేదీని తర్వాత వెల్లడిస్తామని కేఆర్‌ఎంబీ తెలిపింది.

9న జీఆర్‌ఎంబీ అత్యవసర సమావేశం

కేంద్ర ప్రభుత్వ గెజిట్‌ నోటిఫికేషన్‌పై చర్చించేందుకు హైదరాబాద్‌ జలసౌధలో ఈనెల 9న గోదావరి నది యాజమాన్యబోర్డు(జీఆర్‌ఎంబీ)  అత్యవసరంగా సమావేశం కానుంది. ఈమేరకు ఏపీ, తెలంగాణకు జీఆర్‌ఎంబీ కార్యదర్శి సమాచారం ఇచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని