National Handloom Day: ఈ కామర్స్‌ ద్వారా నేతన్నలకు మార్కెటింగ్‌ సౌకర్యం: కేటీఆర్‌

తాజా వార్తలు

Published : 07/08/2021 14:47 IST

National Handloom Day: ఈ కామర్స్‌ ద్వారా నేతన్నలకు మార్కెటింగ్‌ సౌకర్యం: కేటీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణలోని నేతన్నలకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌ పీపుల్స్‌ ప్లాజాలో నిర్వహించిన వేడుకలకు కేటీఆర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. అనంతరం చేనేత కళాకారులతో కేటీఆర్ ప్రతిజ్ఞ చేయించారు.

చేనేత కార్మికులకు ఉపాధి, ఆర్థిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కామర్స్‌ ద్వారా నేతన్నలకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా చేనేతకు చేయూత కింద రూ. 30 కోట్ల చెక్కును అందించారు. నేతన్నల ఉత్పత్తులు ప్రోత్సహించేందుకే సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఏటా చేనేత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ నేతన్నలు భారతీయ సంస్కృతికి వైభవం తీసుకొచ్చారని కొనియాడారు. 2014కి ముందు చేనేతకు బడ్జెట్‌లో రూ.70 కోట్లే కేటాయించారన్నారు. తెలంగాణ వచ్చాక రూ.1200 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. చేనేత మిత్ర ద్వారా 50 శాతం రాయితీ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించి నేతన్నలకు చేయూతనివ్వాలని కేటీఆర్‌ కోరారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని