KTR On Sircilla Floods: ప్రజలెవరూ ఆందోళన చెందొద్దు: కేటీఆర్‌

తాజా వార్తలు

Updated : 07/09/2021 13:01 IST

KTR On Sircilla Floods: ప్రజలెవరూ ఆందోళన చెందొద్దు: కేటీఆర్‌

హైదరాబాద్‌: వర్షాలతో జలదిగ్బంధంలో చిక్కుకున్న సిరిసిల్లలో త్వరితగతిన సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్‌ కమిషనర్లతో ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సిరిసిల్ల పట్టణంలోని అనేక ప్రాంతాల్లో కాలనీల్లోకి వరదనీరు చేరిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి.. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించాలని ఆదేశించారు. ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాలకు డీఆర్‌ఎఫ్‌ బృందాలను తరలించినట్లు చెప్పారు. వరదనీరు మళ్లింపునకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని.. అన్ని విధాలుగా సహాయక చర్యలు చేపట్టేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని