Ts News: భూముల విలువ పెంచుతూ ఉత్తర్వులు

తాజా వార్తలు

Updated : 20/07/2021 19:15 IST

Ts News: భూముల విలువ పెంచుతూ ఉత్తర్వులు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులు, భూముల విలువలు, రిజిస్ట్రేషన్‌ రుసుంలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన మార్కెట్‌ విలువలు ఈ నెల 22 నుంచి అమల్లోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ కమిషనర్‌ను సీఎస్‌ ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో భూముల విలువ, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలతో పాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ ద్వారా అందే అన్ని సేవల ఛార్జీలు పెంచాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిన విషయం తెలిసిందే. భూములు, ఆస్తుల విలువ పెంపునకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను కూడా అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు అమలులో ఉన్న ఆరు శాతం రిజిస్ట్రేషన్‌ రుసుంను 7.5 శాతానికి పెంచింది. వ్యవసాయ భూముల కనిష్ఠ మార్కెట్‌ విలువ ఎకరాకు రూ.75 వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది. స్లాబుల వారీగా 50 శాతం, 40 శాతం, 30 శాతం లెక్కన మూడు స్లాబుల్లో వ్యవసాయ భూముల మార్కెట్‌ విలువలను పెంచినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అదే విధంగా ఓపెన్‌ ప్లాట్ల చదరపు గజం కనీస ధర రూ.100 నుంచి రూ.200లకు పెంచిన ప్రభుత్వం.. స్లాబులు వారీగా 50 శాతం, 40 శాతం, 30 శాతం లెక్కన మూడు స్లాబుల్లో ఓపెన్‌ ప్లాట్ల మార్కెట్‌ విలువలను పెంచినట్లు స్పష్టం చేసింది. ఆలాగే అపార్ట్‌మెంట్ల ఫ్లాట్ల చదరపు అడుగు కనీస విలువ రూ.800 నుంచి రూ.1000కి పెంచిన ప్రభుత్వం.. చదరపు అడుగుపై 20 శాతం, 30 శాతం లెక్కన పెంచినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

పెంపు ఇందుకే..

ఎనిమిదేళ్లుగా భూముల విలువను సవరించలేదు. ఈ కాలంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీఎస్‌డీపీ), తలసరి ఆదాయం రెట్టింపయ్యాయి.

నూతన ప్రాజెక్టులతో కొత్త ఆయకట్టు అభివృద్ధి చెందింది. సాగునీటి వసతి విస్తరించడంతో భూముల విలువ భారీగా పెరిగింది.

రాష్ట్రంలో ఐటీ, ఔషధ, పర్యాటకం, స్థిరాస్తి రంగాల్లో పెరుగుదల, కొత్త జిల్లాల ఏర్పాటు, ప్రతిపాదిత ప్రాంతీయ రింగ్‌రోడ్డు వివిధ రంగాల్లో అభివృద్ధి నేపథ్యంలో భూముల మార్కెట్‌ విలువలు సవరించాలి.

గతంలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన సెంట్రల్‌ వాల్యుయేషన్‌ సలహా కమిటీ భూముల విలువను సవరించాలని ప్రతిపాదించింది.

ఏమేం పెరగనున్నాయ్‌..

భూములు, ఇళ్లు, ఫ్లాట్లు, ప్లాట్ల క్రయవిక్రయాలపై ప్రస్తుతం స్టాంపు డ్యూటీ 4శాతం ఉండగా ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ 1.5, రిజిస్ట్రేషన్‌ ఫీజు 0.5 శాతంగా ఉంది. మొత్తం 6శాతం రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను చెల్లిస్తున్నారు. ఇకపై పెరగనున్నవి.

భూముల విలువ 

రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు

విక్రయ అగ్రిమెంట్‌/జీపీఏ

డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌, జీపీఏ

డెవలప్‌మెంట్‌ కన్‌స్ట్రక్షన్‌ అగ్రిమెంట్‌

కుటుంబీకుల భాగపక్షాల రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు

కుటుంబ, కుటుంబేతరుల మధ్య ఒప్పందాలు

బహుమతి(గిఫ్ట్‌)

టైటిల్‌ డీడ్‌ డిపాజిట్‌

జీపీఏ (ఆథరైజేషన్‌తో, ఆథరైజేషన్‌ లేకుండా) 

వీలునామా 

లీజు సహా ఇతర సేవల ఛార్జీలు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని