అశోక్‌గజపతిరాజును కలిసిన కళాశాల ఉద్యోగులు

తాజా వార్తలు

Updated : 17/07/2021 20:47 IST

అశోక్‌గజపతిరాజును కలిసిన కళాశాల ఉద్యోగులు

విజయనగరం: జీతాలు చెల్లించాలంటూ మాన్సాస్‌ కార్యాలయాన్ని ట్రస్టు కళాశాలల ఉద్యోగులు శనివారం ముట్టడించి ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ నెల 13లోగా సమస్యలు పరిష్కరిస్తామని ట్రస్టు ఈవో హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించిన కళాశాల ఉద్యోగులు ట్రస్టు ఛైర్మన్‌ అశోక్‌గజపతిరాజును కలిశారు. అన్యాయంగా జీతాలు నిలిపివేశారని ఆయన వద్ద వాపోయారు. మాన్సాస్‌ ట్రస్టు ఈవో పొంతనలేని జవాబిస్తున్నారని.. చొరవ తీసుకొని జీతాల సమస్య పరిష్కరించాలని అశోక్‌గజపతిరాజుకు ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు.

అశోక్‌గజపతిరాజు మాట్లాడుతూ.. ఉద్యోగుల పట్ల ట్రస్టు ఈవో వెంకటేశ్వరరావు తీరు సరిగా లేదన్నారు. ట్రస్టులో నిధులున్నా ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవడంపై అనుమానం వ్యక్తం చేశారు. కరోనా వేళ కూడా మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ట్రస్టు ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తనను కలిసేందుకు ఈవోకు తీరిక దొరకడం లేదంటూ ఎద్దేవా చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని