KTR: కంటి చికిత్స పరికరాల తయారీకి ముందుకొస్తే క్లస్టర్‌ ఏర్పాటు: కేటీఆర్‌

తాజా వార్తలు

Updated : 22/09/2021 19:48 IST

KTR: కంటి చికిత్స పరికరాల తయారీకి ముందుకొస్తే క్లస్టర్‌ ఏర్పాటు: కేటీఆర్‌

హైదరాబాద్‌: కంటి చికిత్స పరికరాల తయారీకి ముందుకొస్తే సుల్తాన్‌పూర్‌లోని మెడికల్‌ డివైసెస్ పార్క్‌లో ప్రత్యేక క్లస్టర్‌ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ప్రపంచ స్థాయి వైద్య సంస్థలు హైదరాబాద్‌లో ఉండటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రంగారెడ్డి జిల్లా కిస్మత్‌పూర్‌లో ఎల్వీ ప్రసాద్‌ ఐ టెక్నాలజీ అండ్‌ ఇంజినీరింగ్‌ సెంటర్‌ను కేటీఆర్‌ ప్రారంభించారు. ప్రస్తుతం 80 శాతం వైద్య పరికరాలు విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నామని వెల్లడించారు. దిగుమతులపై ఆధారపడకుండా దేశంలోనే ఉత్పత్తి జరగాలని ఆకాంక్షించారు. సుల్తాన్‌పూర్‌లో ఏర్పాటు చేసిన రాష్ట్రంలోనే అతిపెద్ద వైద్య పరికరాల తయారీ పార్క్‌లో ఇప్పటికే 28 సంస్థలు కార్యాలయాల ఏర్పాటుకు ముందుకొచ్చాయని కేటీఆర్‌ తెలిపారు. మూడేళ్ల క్రితం కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని అందరికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు గుర్తు చేశారు. కంటి చికిత్స పరికరాల తయారీకి ముందుకొస్తే క్లస్టర్‌ ఏర్పాటు చేస్తామని కేటీఆర్‌ స్పష్టం చేశారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని