Harish rao: ఇళ్లు పూర్తిగా ధ్వంసమైన వారికి ఆర్థిక సాయం: హరీశ్‌రావు

తాజా వార్తలు

Published : 28/09/2021 01:35 IST

Harish rao: ఇళ్లు పూర్తిగా ధ్వంసమైన వారికి ఆర్థిక సాయం: హరీశ్‌రావు

సిద్దిపేట: గులాబ్‌ తుపాను దృష్ట్యా మంత్రి హరీశ్‌రావు అధికారులను అప్రమత్తం చేశారు. సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో నెలకొన్న తాజా పరిస్థితులపై కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు క్షేత్రస్థాయి పరిస్థితులను గమనించాలని ఆదేశించారు. జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులు ఆయా కేంద్రాల్లోనే ఉండాలన్నారు. చెరువులు, జలాశయాల నీటి మట్టాలు పర్యవేక్షిస్తూ ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. కంట్రోల్‌ రూమ్‌కు వచ్చే సమస్యలపై తక్షణమే స్పందించాలన్నారు. తుపాను కారణంగా ఇళ్లు పూర్తిగా ధ్వంసమైన వారికి ఆర్థిక సాయం అందేలా చూడాలని అధికారులను హరీశ్‌ ఆదేశించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని