Ts News: రక్షణ రంగ పరిశ్రమలకు కేంద్రంగా హైదరాబాద్‌: కేటీఆర్‌

తాజా వార్తలు

Published : 24/10/2021 21:49 IST

Ts News: రక్షణ రంగ పరిశ్రమలకు కేంద్రంగా హైదరాబాద్‌: కేటీఆర్‌

హైదరాబాద్‌: విదేశాలకు చెందిన రక్షణ రంగ సంస్థలకు ప్రాధాన్యతా కేంద్రంగా హైదరాబాద్‌ అవతరిస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. బోయింగ్ లాంటి పరిశ్రమలు ముందుకొస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో జరిగిన ఇంటిగ్రేటెడ్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ ఫెసిలిటీ కార్యక్రమంలో కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి డీఆర్‌డీఓ ఛైర్మన్‌ సతీష్‌ రెడ్డి, నీతి ఆయోగ్‌ సభ్యులు సారస్వత్‌ హాజరయ్యారు. రక్షణ రంగానికి చెందిన నిపుణులు హైదరాబాద్‌లో ఉన్నారని.. ఈ రంగం అభివృద్ధికి ప్రోత్సాహం, మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన వేం టెక్నాలజీ సంస్థను ఈ సందర్భంగా కేటీఆర్ అభినందించారు. ఈ పెట్టుబడితో రాష్ట్రంలో కొత్తగా 2వేల మందికి ఉపాధి లభిస్తుందని కేటీఆర్‌ వెల్లడించారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని