Pink Book: పెట్టుబడిదారుల భవిష్యత్‌ నిర్ణయాలకు దిక్సూచి: కేటీఆర్‌

తాజా వార్తలు

Updated : 31/07/2021 17:54 IST

Pink Book: పెట్టుబడిదారుల భవిష్యత్‌ నిర్ణయాలకు దిక్సూచి: కేటీఆర్‌

హైదరాబాద్: తెలంగాణలో పెట్టుబడులు, అవకాశాలు, ఇతర అంశాలతో సమగ్రంగా రూపొందించిన ‘పింక్ బుక్ - ఇన్వెస్టర్స్ గైడ్ టు తెలంగాణ 2021’ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రగతిభవన్‌లో ఆవిష్కరించారు. రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాలు, సౌకర్యాలు, మౌలిక వసతులను తెలిపే ఈ పుస్తకం.. పెట్టుబడిదారులు భవిష్యత్‌లో తీసుకొనే నిర్ణయాలకు దిక్సూచి లాంటిదన్నారు. సులభతర వాణిజ్యంలో దేశంలోనే ఉత్తమ రాష్ట్రాల్లో ఒకటిగా తెలంగాణ ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. రంగాల వారీగా ప్రభుత్వ విధానాలను పింక్ బుక్ ద్వారా తెలుసుకోవడమే కాకుండా.. సులభతర వాణిజ్యాన్ని పెంపొందించడంలో ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఇతర అధికారులు పింక్‌ బుక్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని