Telugu News: పెను సవాల్‌గా సైబర్‌ సెక్యూరిటీ.. దేశానికే ఆదర్శమైన పాలసీని తీసుకొస్తాం: కేటీఆర్‌

తాజా వార్తలు

Published : 22/10/2021 01:40 IST

Telugu News: పెను సవాల్‌గా సైబర్‌ సెక్యూరిటీ.. దేశానికే ఆదర్శమైన పాలసీని తీసుకొస్తాం: కేటీఆర్‌

హైదరాబాద్‌: యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికాకు చెందిన ప్రముఖ ఐటీ, సైబర్ సెక్యూరిటీ సంస్థ ఇవాంటి హైదరాబాద్‌లో మరింత విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఇవాంటి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆధునిక సాంకేతికత సాయంతో మనం నేరుగా ఉపకరణాలతో అనుసంధానం కాగలుగుతున్నా.. వ్యక్తులు, ప్రభుత్వాలు, సంస్థలకు సైబర్ భద్రత ఈ రోజుల్లో పెను సవాల్‌గా మారిందని కేటీఆర్ పేర్కొన్నారు. సైబర్ సెక్యూరిటీ విధానం కోసం ఇవాంటి వంటి సంస్థలతో కలిసి పనిచేసి దేశానికే ఆదర్శమైన పాలసీని రూపొందిస్తామని కేటీఆర్ అన్నారు. రాబోయే రెండేళ్లలో ఒక ఆవిష్కరణ కేంద్రంతో పాటు, ఉద్యోగుల సంఖ్యను 2 వేలకు పెంచనున్నట్లు ఇవాంటి చేసిన ప్రకటనను కేటీఆర్ స్వాగతించారు. అదేవిధంగా సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించడంలో భాగంగా ఇవాంటి నిర్వహించే హ్యాకథాన్‌లో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్యం అవుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని