TS News: ఇంటర్‌ పరీక్షలు.. గంట ముందొచ్చినా అనుమతిస్తాం: సబిత

తాజా వార్తలు

Published : 21/10/2021 14:12 IST

TS News: ఇంటర్‌ పరీక్షలు.. గంట ముందొచ్చినా అనుమతిస్తాం: సబిత

హైదరాబాద్‌: కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఈ నెల 25 నుంచి ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తు్న్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఇంటర్‌ పరీక్షలపై విద్యాశాఖ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆమె.. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి వచ్చినా అనుమతిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
కరోనా పరిస్థితుల వల్ల ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను రెండో ఏడాదికి ప్రమోట్ చేశామని.. అయితే పరిస్థితులు అనుకూలించినప్పుడు పరీక్షలు నిర్వహిస్తామని ముందే చెప్పామని మంత్రి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4లక్షల 58వేల మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పరీక్ష కేంద్రాలను 1,400 నుంచి 1,750కి పెంచినట్లు వివరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని