తెలంగాణలో మరో కొత్త పథకం

తాజా వార్తలు

Updated : 18/07/2021 20:51 IST

తెలంగాణలో మరో కొత్త పథకం

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త పథకం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీ సాధికారత పథకానికి ‘తెలంగాణ దళిత బంధు’ పేరును ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఖరారు చేశారు. రాష్ట్రంలో దళితుల సమగ్ర అభివృధ్ధి కోసం సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పైలట్‌ ప్రాజెక్టు కింద ముందుగా ఒక నియోజకవర్గంలో ఈ పథకం అమలు చేయనున్నారు. 

తెలంగాణ ఉద్యమానికి నాందిగా నిర్వహించిన సింహగర్జన సభ మొదలుకొని, తాను ఎంతగానో అభిమానించిన రైతు బీమా పథకం వరకు కరీంనగర్‌ జిల్లా నుంచే అనేక పథకాలను సీఎం ప్రారంభించారు. అదే ఆనవాయితీని.. అదే సెంటిమెంట్‌ని కొనసాగిస్తూ ‘తెలంగాణ దళిత బంధు’ పథకాన్ని కూడా కరీంనగర్‌ జిల్లాలోని హుజూరాబాద్‌ నియోజకవర్గం నుంచే ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు. ప్రారంభోత్సవ తేదీని త్వరలోనే సీఎం కేసీఆర్‌ ప్రకటించనున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని