సాయం కోసం వేళ్తే రూ.70లక్షల స్థలం ఆక్రమణ

తాజా వార్తలు

Published : 20/07/2021 11:04 IST

సాయం కోసం వేళ్తే రూ.70లక్షల స్థలం ఆక్రమణ

మణికొండ మున్సిపాలిటీ ప్రజాప్రతినిధి దౌర్జన్యం

ఈనాడు, హైదరాబాద్‌: సాయం చేయాలంటూ ఓ వితంతువు మణికొండ మున్సిపాలిటీ ప్రజాప్రతినిధిని ఆశ్రయిస్తే.. ఏకంగా ఆమె భర్త పేరుతో ఉన్న స్థలాన్ని తన బంధువుపేరుతో రిజిస్ట్రేషన్‌ చేసి ఆక్రమించుకున్నాడు. బాధితురాలు, ఆమె కుమారుడు హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా... ప్రాథమిక విచారణ చేసిన అనంతరం కేసు నమోదు చేసి సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌కు బదిలీ చేశారు.
హక్కు పత్రం కోసం వెళితే..  నెక్నాంపూర్‌లో  బాధితురాలు లక్ష్మి భర్తకు 163 చదరపు గజాల స్థలం ఉంది.  మున్సిపాలిటీలో విలీనం అయ్యాక శిస్తుకూడా కడుతున్నారు. రెండేళ్ల క్రితం లక్ష్మి భర్త చనిపోయాడు. దీంతో ఆమె తనపేరుతో హక్కు పత్రం కావాలంటూ కొద్దినెలల క్రితం మున్సిపల్‌ కౌన్సిలర్‌ను ఆశ్రయించారు. నకలు పత్రాలన్నీ తీసుకున్న కౌన్సిలర్‌ రూ.2లక్షలు డిమాండ్‌ చేశాడు. తాము ఇచ్చుకోలేమని చెప్పడంతో 163 గజాల స్థలంలో రూ.70లక్షల విలువైన 100 గజాల స్థలాన్ని తన స్నేహితుడిదంటూ నకిలీ పత్రాలు సృష్టించి తన సోదరుడి కుమారుడి పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించాడు. బాధితురాలు  కౌన్సిలర్‌ను అడగ్గా.. ఆ స్థలమే మీదికాదు.. కావాలంటే చూసుకోండి అంటూ.. తనకు కమీషన్‌ ఇవ్వనందుకు ఇలా చేశానంటూ ఎగతాళిగా మాట్లాడాడు. దీంతో రిజిస్ట్రార్‌ కార్యాలయం నుంచి పత్రాలు సేకరించింది. అసలు ఆధార్‌ కార్డు, నకిలీ ఆధార్‌ కార్డు వివరాలతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని