AP News: 4 అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీల పరిధి పెంచుతూ ఉత్తర్వులు

తాజా వార్తలు

Published : 23/09/2021 21:59 IST

AP News: 4 అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీల పరిధి పెంచుతూ ఉత్తర్వులు

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా నాలుగు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీల పరిధిని పెంచుతూ ప్రభుత్వ నోటిఫికేషన్లు విడుదల చేసింది. తిరుపతి, కర్నూలు, చిత్తూరు, పలమనేరు-కుప్పం-మదనపల్లె అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీల్లో సమీప గ్రామాలను విలీనం చేస్తూ వేర్వేరు నోటిఫికేసన్లు జారీ చేసింది. 

*తిరుపతి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీలోకి యర్రావారిపల్లె మండలంలోని 12 గ్రామాలను తీసుకువస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 12 గ్రామాల విలీనంతో కొత్తగా 185 చదరపు కిలోమీటర్ల ప్రాంతం తుడా పరిధిలోకి రానుంది.  దీంతో మొత్తంగా తుడా పరిధి 4,657 చదరపు కిలోమీటర్లకు పెరిగింది.

* కర్నూలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ పరిధిలోకి మొత్తం 15 మండలాల్లోని 129 గ్రామాలు రానున్నాయి. ఆళ్లగడ్డ మండలంలోని 8 గ్రామాలు, చాగలమర్రి పరిధిలోని 6 గ్రామాలు, డోర్నిపాడు, రుద్రవరం, గోస్పాడు,ఉయ్యాలవాడ మండలం పరిధిలోని 23 గ్రామాలు, ఆత్మకూరు, బండి ఆత్మకూరు, మహానంది మండలాల్లోని వేర్వేరు గ్రామాలు కుడా పరిధిలోకి వచ్చాయి. వెలిగోడు, నంద్యాల, బనగానపల్లె 14, కోయిల్ కుంట్ల మండలంలోని 18 గ్రామాలు, సంజమల, కొలిమిగుండ్ల మండలాల్లోని గ్రామాలు కుడా పరిధిలోకి వచ్చాయి.  ఆళ్లగడ్డ, ఆత్మకూరు మున్సిపాలిటీల పరిధిలో ఉన్న 98 చదరపు కిలోమీటర్ల ప్రాంతంతో కలిపి కొత్తగా 1793 చదరపు కిలోమీటర్ల ప్రాంతం కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కిందకు వచ్చింది. దీంతో కర్నూలు అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ పరిధి 12,786 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. 

* చిత్తూరు అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ పరిధిలోకి కొత్తగా మరో 48 గ్రామాలు వచ్చి చేరాయి. దీంతో చుడా పరిధిలోకి కొత్తగా మూడు మండలాల్లోని 662 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని తీసుకువస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు.

* పలమనేరు - కుప్పం-మదనపల్లె అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ పరిధిలోకి కొత్తగా ఆరు మండలాలను కలుపుతూ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. పీకేఎం ఉడా పరిధిలోకి 1439 చదరపు కిలోమీటర్ల ప్రాంతం కొత్తగా వచ్చినట్టు ప్రభుత్వం పేర్కోంది. దీంతో పీకేఎం ఉడా పరిధి 3875 చదరపు కిలోమీటర్లకు పెరిగింది


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని