Telangana High Court: ఆగస్టు 9 నుంచి పాక్షికంగా ప్రత్యక్ష విచారణ

తాజా వార్తలు

Published : 31/07/2021 14:45 IST

Telangana High Court: ఆగస్టు 9 నుంచి పాక్షికంగా ప్రత్యక్ష విచారణ

హైదరాబాద్‌: ఆగస్టు 9వ తేదీ నుంచి పాక్షికంగా ప్రత్యక్ష విచారణ ప్రారంభించాలని హైకోర్టు నిర్ణయించింది. ఆగస్టు 9 నుంచి సెప్టెంబరు 9వ తేదీ వరకు పాక్షికంగా కేసుల ప్రత్యక్ష విచారణ చేపట్టాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ప్రతి రోజూ ఒక ధర్మాసనం, ఒక సింగిల్ బెంచ్ ప్రత్యక్ష విచారణ చేపట్టాలని సూచించింది. వ్యాక్సిన్ వేసుకున్న న్యాయవాదులనే విచారణకు అనుమతించాలని పేర్కొంది. వాదించాల్సిన కేసులు ఉన్న న్యాయవాదులు మాత్రమే విచారణకు హాజరుకావాలని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. ప్రస్తుతం అమల్లో ఉన్న మార్గదర్శకాల మేరకు ఆగస్టు 8 వరకు హైకోర్టులో ఆన్‌లైన్‌లోనే విచారణ ప్రక్రియ కొనసాగించనున్నట్లు స్పష్టం చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని