TS High Court: పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించండి: హైకోర్టు

తాజా వార్తలు

Published : 28/09/2021 13:53 IST

TS High Court: పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించండి: హైకోర్టు

హైదరాబాద్‌: తెలంగాణలో గతేడాది సెప్టెంబర్‌- అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆ రైతులకు మూడు నెలల్లో ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లించాలని స్పష్టం చేసింది. రైతులు నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలంటూ రైతు స్వరాజ్య వేదిక దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. కర్షకులకు నాలుగు నెలల్లో పంటబీమా సొమ్ము చెల్లించాలని ఆదేశించింది. దీంతో పాటు నష్టాల పాలైన కౌలుదారులకు పరిహారం, బీమా చెల్లించాలని పేర్కొంది. నష్టపోయిన రైతులను త్వరగా గుర్తించాలని ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని