ఆ టీకాలు రాష్ట్రానికి కేటాయించండి: జగన్‌

తాజా వార్తలు

Updated : 16/07/2021 17:05 IST

ఆ టీకాలు రాష్ట్రానికి కేటాయించండి: జగన్‌

అమరావతి: ప్రైవేటు ఆస్పత్రులకు కేటాయించిన టీకా కోటాను తిరిగి రాష్ట్రానికే కేటాయించాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్రమోదీని కోరారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎం జగన్.. కొవిడ్ కట్టడిలో రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర విభజన కారణంగా వైద్య పరంగా మౌలిక సదుపాయాల కల్పన విషయంలో అనేక సమస్యలు ఎదుర్కొన్నామని వివరించారు. అయినప్పటికీ కరోనా కట్టడిలో మెరుగైన పనితీరు కనబర్చినట్లు సీఎం తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలు వైరస్ వ్యాప్తిని అడ్డుకోవటంలో సమర్థంగా పనిచేశాయన్నారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 12 సార్లు ఫీవర్ సర్వే నిర్వహించినట్లు సీఎం వెల్లడించారు. తీవ్రత ఆధారంగా పరీక్షలు నిర్వహించడం ద్వారా వ్యాప్తిని నియంత్రించగలిగామన్నారు. కొవిడ్ టీకాకు సంబంధించి జులైలో 53,14,740 టీకాలు మాత్రమే రాష్ట్రానికి కేటాయించారన్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు 17,71,580 టీకా డోసులిచ్చారని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. కేటాయించిన వ్యాక్సిన్లను ప్రైవేటు ఆస్పత్రులు పూర్తిస్థాయిలో వినియోగించుకోలేక పోతున్నారని.. ఆ టీకాలనూ రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగంగా చేపట్టేందుకు దోహదపడుతందని వివరించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని