Polycet Results: రేపే పాలిసెట్‌ ఫలితాలు.. కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

తాజా వార్తలు

Published : 27/07/2021 15:36 IST

Polycet Results: రేపే పాలిసెట్‌ ఫలితాలు.. కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే పాలిసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణా మండలి ప్రకటించింది. ఫలితాలు ప్రకటించనున్న నేపథ్యంలో పాలిటెక్నిక్‌ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను మండలి విడుదల చేసింది. ఆగస్టు 5 నుంచి తొలి విడత ప్రవేశాలు జరగనున్నాయి. ఆగస్టు 5 నుంచి 9 వరకు ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్‌ బుకింగ్‌ నిర్వహిస్తారు. అదే నెల 6 నుంచి 10 వరకు పాలిసెట్‌ అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. దీంతో పాటు 6 నుంచి 12 వరకు వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. ఆగస్టు 14న సీట్ల కేటాయింపు ఉంటుంది. 23న తుది విడత పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ ఉంటుంది. అదే రోజు ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవడానికి వీలు కల్పించారు. ఆగస్టు 24న రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన.. 24, 25 తేదీల్లో రెండో విడత వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. ఆగస్టు 27న రెండో విడత పాలిటెక్నిక్‌ సీట్లు కేటాయిస్తారు. సెప్టెంబర్‌ 1న నుంచి పాలిటెక్నిక్‌ విద్యాసంవత్సరం ప్రారంభం అవుతుంది. సెప్టెంబరు 9న స్పాట్ ప్రవేశాలకుగాను మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని