Hyderabad: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షం

తాజా వార్తలు

Updated : 26/08/2021 18:22 IST

Hyderabad: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షం

హైదరాబాద్‌: హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వాతావరణం చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అంబర్‌పేట, మలక్‌పేట, ఎల్బీనగర్‌, సైదాబాద్‌, వనస్థలిపురం, రామంతాపూర్‌, దిల్‌సుక్‌నగర్‌, బషీర్ బాగ్, బేగంబజార్, కోఠి, సుల్తాన్​బజార్, అబిడ్స్​, నాంపల్లి, హిమాయత్​నగర్​, లిబర్టీ, లక్డికాపూల్‌, ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. సాయంత్రం పలుచోట్ల కురిసిన వర్షాలకు నగరవాసులు తడిసి ముద్దయ్యారు. వర్షం తాకిడిని తట్టుకునేందుకు వాహనదారులు, బాటసారులు చెట్ల కింద తలదాచుకున్నారు. రహదారులపైకి నీరు చేరడంతో వివిధ పనుల కోసం బయటకు వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని