Hyderabad: భారీ వర్షంలోనూ కొనసాగుతున్న గణేశ్‌ నిమజ్జనం

తాజా వార్తలు

Published : 19/09/2021 16:31 IST

Hyderabad: భారీ వర్షంలోనూ కొనసాగుతున్న గణేశ్‌ నిమజ్జనం

హైదరాబాద్‌: భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఒక వైపు వర్షం మరో వైపు వినాయక విగ్రహాల ఊరేగింపు, నిమజ్జనంతో ట్యాంక్‌ బండ్‌ కొత్త శోభ సంతరించుకుంది. నగరంలోని అంబర్ పేట్, కాచిగూడ, గోల్నాక, మొజాంజాహీ మార్కెట్,  సికింద్రాబాద్‌, తార్నాక, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, కూకట్‌పల్లి, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ, ప్రగతి నగర్, కుషాయిగూడ, చర్లపల్లి, కీసర, రాంపల్లి, పాతబస్తీ, చార్మినార్, ట్యాంక్‌బండ్‌, ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌, పెద్దఅంబర్‌పేట్‌, అబ్దుల్లాపూర్‌మెట్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా గణేశ్‌ శోభాయాత్ర నెమ్మదిగా సాగుతోంది. ట్యాంక్‌బండ్‌పై  వర్షం కురుస్తున్నప్పటికీ లెక్క చేయకుండా భారీ అలంకరణతో వినాయక విగ్రహాలను తీసుకొచ్చి క్రేన్‌ల సాయంతో సాగర్‌లో నిమజ్జనం చేస్తున్నారు. యువత కేరింతలు కొడుతూ ఉత్సాహంగా నిమజ్జనత్సోవంలో పాల్గొంటున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని