Ram madhav: రామ్‌మాధవ్‌ కొత్త పుస్తకం... ‘హిందుత్వ పారడైమ్‌’

తాజా వార్తలు

Published : 17/10/2021 22:12 IST

Ram madhav: రామ్‌మాధవ్‌ కొత్త పుస్తకం... ‘హిందుత్వ పారడైమ్‌’

హైదరాబాద్‌: పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ ఆలోచనా విధానం 21వ శతాబ్దంలో భారతదేశానికి, ప్రపంచానికి ఏ విధంగా మార్గదర్శకం కాగలుగుతుందనే  అంశంపై  ‘హిందుత్వ పారడైమ్‌’ పేరుతో భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి రామ్‌మాధవ్‌ పుస్తకం రాశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో జాతీయ జ్యూడిషియల్‌ అకాడమీ మాజీ ఛైర్మన్‌ జస్టిస్‌ జి.రఘురామ్‌ ఈపుస్తకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా రామ్‌మాధవ్‌ మాట్లాడుతూ.. ‘‘దేశంలోని సామాజిక, రాజకీయ పరిస్థితులను నూతన దృక్పథంతో మళ్లీ విశ్లేషించుకోవాల్సిన ఆవశ్యకత వచ్చింది. ఆ విశ్లేషణలో దీన్‌దయాళ్‌ ఆలోచనా విధానం ఎంతో ఉపయోగపడుతుందనే ఆలోచనతో ఈ పుస్తకం రాశా. ఈ పుస్తకంలో రాజకీయ, ప్రజాస్వామ్య వ్యవస్థలు, సెక్యులర్‌ విధానాలు, ఆర్థిక వ్యవస్థలు వీటన్నింటిపై చర్చించా. పాశ్చాత్య వ్యవస్థలనే గత 70 ఏళ్లుగా ముందుకు తీసుకెళ్తున్నాం.. వాటిని అమలు చేస్తున్నాం. అయితే మనకంటూ కొన్ని వ్యవస్థలను జోడిస్తే భారతదేశాన్ని తక్కువ సమయంలోనే మరింత శక్తివంతమైన దేశంగా, ఐకమత్యమైన దేశంగా తయారు చేసి ప్రపంచంలో బలమైన శక్తిగా నిలబెట్టగలుగుతాం. ఆ ఉద్దేశంతో అన్ని వ్యవస్థల గురించి పుస్తకంలో చర్చించా. రాజకీయ, కుల వ్యవస్థల్లో మన విధానాలు, పాశ్చాత్య విధానాలపై చర్చించా’’ అని రామ్‌మాధవ్‌ వివరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని