Krishna flood సాగర్‌, పులిచింతలకు తగ్గిన వరద ప్రవాహం

తాజా వార్తలు

Updated : 03/08/2021 20:11 IST

Krishna flood సాగర్‌, పులిచింతలకు తగ్గిన వరద ప్రవాహం

హైదరాబాద్‌: ఎగువ నుంచి వరద ప్రవాహం తగ్గడంతో పులిచింతల జలాశయం గేట్లు పూర్తిగా మూసివేశారు. ప్రస్తుతం ఎగువ నుంచి కేవలం 8వేల క్యూసెక్కుల ప్రవాహం మాత్రమే వస్తోంది. దీంతో గేట్లు మూసివేసిన అధికారులు .. 8వేల క్యూసెక్కుల నీటిని విద్యుత్‌ ఉత్పత్తికోసం మళ్లించారు. జలాశయం పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 43.93 టీఎంసీలుగా ఉంది. నాగార్జున సాగర్‌ నుంచి భారీగా వరదనీరు రావటంతో గత రెండురోజులుగా పులిచింతల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. వరదనీటి కారణంగా ప్రస్తుతం ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ప్రస్తుతం సాగర్‌ నుంచి నాలుగు క్రస్ట్‌ గేట్ల ద్వారా 31,140 క్యూసెక్కులనీరు దిగువకు విడుదల చేస్తున్నారు.

ప్రకాశం బ్యారేజికి భారీగా వరద
మరో వైపు ప్రకాశం బ్యారేజికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజి ఇన్‌ఫ్లో 2.31 లక్షల క్యూసెక్కులు కాగా, 70 గేట్లు ఎత్తి దిగువకు 2.22 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజి నుంచి కాలువలకు 9,689 క్యూసెక్కులు వదులుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని