హైదరాబాద్‌ శివారులో లారీ బోల్తా.. భారీగా ట్రాఫిక్‌జామ్‌

తాజా వార్తలు

Updated : 15/07/2021 15:33 IST

హైదరాబాద్‌ శివారులో లారీ బోల్తా.. భారీగా ట్రాఫిక్‌జామ్‌

అబ్దుల్లాపూర్‌మెట్‌‌: హైదరాబాద్‌ శివారు అబ్దుల్లాపూర్‌మెట్ సమీపంలో జాతీయ రహదారి- 65పై అదుపుతప్పిన సిమెంట్‌ మిక్సింగ్‌ లారీ బోల్తా పడింది. దీంతో హైదరాబాద్‌- విజయవాడ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్ ఏర్పడింది. వాహనం రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఫలితంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని క్రేన్‌ సాయంతో లారీని తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని