AP High Court: మధ్యంతర బెయిల్‌కు హైకోర్టును ఆశ్రయించిన సాంబశివరావు

తాజా వార్తలు

Published : 19/09/2021 12:12 IST

AP High Court: మధ్యంతర బెయిల్‌కు హైకోర్టును ఆశ్రయించిన సాంబశివరావు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌)కు సంబంధించిన కేసులో నిన్న అరెస్టైన ఐఆర్‌టీఎస్‌ అధికారి కోగంటి సాంబశివరావు ఏపీ హైకోర్టులో హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. మధ్యంతర బెయిల్ పిటిషన్‌తో పాటు సీఐడీ నమోదు చేసిన కేసు కొట్టి వేయాలని ఆయన కోర్టును కోరారు. స్పందించిన కోర్టు ఈ పిటిషన్‌పై రేపు విచారణ చేపడతామని వివరించింది.

ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌కు సంబంధించిన తొలి దశ టెండర్లను గత ప్రభుత్వ హయాంలో టెరా సాఫ్ట్‌వేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు అక్రమంగా కట్టబెట్టారన్న ఆరోపణలపై నమోదైన కేసులో సాంబశివరావును సీఐడీ అధికారులు నిన్న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న ఆయన అప్పట్లో.. ఆంధ్రప్రదేశ్‌ మౌలిక వసతుల సంస్థ (ఇన్‌క్యాప్‌) ఎండీగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలో చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని