Cyclone Gulab: అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి: స్పెషల్‌ సీఎస్‌

తాజా వార్తలు

Published : 27/09/2021 21:22 IST

Cyclone Gulab: అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి: స్పెషల్‌ సీఎస్‌

హైదరాబాద్‌: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తోన్న దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండి ఏ విధమైన అస్తి, ప్రాణ నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని..  అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, స్పెషల్ సీఎస్ అర్వింద్ కుమార్ అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ కమిషనర్, జోనల్ కమిషనర్లు, మున్సిపల్ శాఖ డైరెక్టర్ తదితరులతో అర్వింద్‌ కుమార్‌ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో చెరువుల్లోకి వచ్చే వరద ప్రవాహాన్ని అంచనా వేసి లోతట్టు ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. జోనల్ సర్కిళ్ల వారీగా ఇప్పటికే ఏర్పాటు చేసిన పునరావాస  కేంద్రాలకు ముంపు బాధితులను తరలించాలని సూచించారు. వారికి మొబైల్ అన్నపూర్ణ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు రాత్రిపూట భోజన సదుపాయం కల్పించాలని ఆదేశించారు.

నీటి నిల్వలు, విరిగిన చెట్లను తొలగించి విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు ఎలాంటి సమస్యకైనా కంట్రోల్ రూమ్‌ నంబర్ 040-21111111ను సంప్రదించాలని సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో అర్ అండ్ బీ, వాటర్ వర్క్స్, పోలీస్, నీటిపారుదల శాఖలను సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 195 మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు, 139 స్టాటిక్ టీమ్స్, ప్రతి లొకేషన్‌లో ఇద్దరు చొప్పున ప్రత్యేక  బృందాలను ఏర్పాటు చేసినట్టు వివరించారు. సీఆర్ఎంపీ ద్వారా మరో 71 బృందాలు, 33 మొబైల్ బృందాలను ఏర్పాటు చేసినట్టు వివరించారు. జోన్‌కు రెండు చొప్పున 237 పంపు సెట్లు, బోట్స్, డీఆర్ఎం ద్వారా 8 బోట్లు, 45 జేసీబీలు, విరిగిన చెట్లు నరికేందుకు 55 పవర్ కట్టింగ్ మిషన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని