AP NEWS: విశాఖలో రోడ్డెక్కిన శాక్రెడ్‌ హార్ట్‌ పాఠశాల విద్యార్థినులు, తల్లిదండ్రులు

తాజా వార్తలు

Updated : 25/10/2021 13:00 IST

AP NEWS: విశాఖలో రోడ్డెక్కిన శాక్రెడ్‌ హార్ట్‌ పాఠశాల విద్యార్థినులు, తల్లిదండ్రులు

విశాఖ: విశాఖలో శాక్రెడ్‌ హార్ట్‌ ఎయిడెడ్‌ బాలికోన్నత పాఠశాల మూసివేతపై విద్యార్థులు, తల్ల్లిదండ్రులు రోడ్డెక్కారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా రాస్తారోకో చేపట్టి.. జ్ఞానాపురం రోడ్డును దిగ్బంధించారు. తమకు నవరత్నాలు వద్దని చదువుకోనిస్తే చాలని విద్యార్థులు నినాదాలు చేశారు. అర్ధాంతరంగా పాఠశాలను మూసేస్తే తమ పిల్లల భవిష్యత్ ఏంటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

విద్యాసంవత్సరం మధ్యలో ఉండగానే పాఠశాలను మూసివేయడం దారుణమని వాపోయారు. దాదాపు 30 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పాఠశాలలో జ్ఞానాపురం, కంచరపాలెం, అల్లిపురం, రైల్వే న్యూకాలని, కొబ్బరితోట, పూర్ణామార్కెట్ ప్రాంతాలకు చెందిన వందల మంది పేద విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని