ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై సుప్రీంలో విచారణ

తాజా వార్తలు

Published : 16/07/2021 14:45 IST

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై సుప్రీంలో విచారణ

దిల్లీ: రాజధాని అమరావతి భూముల విషయంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఆరోపణలపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో ఎలాంటి అవకతవకలు జరిగలేదంటూ ఏపీ హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. తమకు వ్యతిరేకంగా ఈ తీర్పు రావడంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే వాదనలు వినిపించారు. 

రాష్ట్ర ప్రభుత్వం వాదనలు, ఆలోచనలు వినకుండా హైకోర్టు ఈ తీర్పు వెలువరించిందని.. తాము లేవనెత్తిన ఏ అంశాన్నీ పరిగణనలోకి తీసుకోనందున పిటిషన్‌పై విచారణ చేపట్టాలని దుష్యంత్‌ దవే సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ద్విసభ్య ధర్మాసనం.. రాష్ట్ర హైకోర్టు అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకున్నాకే తీర్పు ఇచ్చినట్లు తాము గమనించామని పేర్కొంది. ఈ అంశంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగినట్లు తమకు కనిపించడం లేదంటూ దుష్యంత్‌ దవే వాదనలతో విభేదించింది. అనంతరం కేసు తదుపరి విచారణను 19కి వాయిదా వేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని