hyderabad news: హైకోర్టును ఆశ్రయించిన తీన్మార్‌ మల్లన్న

తాజా వార్తలు

Updated : 06/08/2021 20:13 IST

hyderabad news: హైకోర్టును ఆశ్రయించిన తీన్మార్‌ మల్లన్న

హైదరాబాద్‌: తనపై నమోదైన కేసులకు సంబంధించి తీన్మార్‌ మల్లన్న హైకోర్టును ఆశ్రయించారు. దర్యాప్తు పేరుతో పోలీసులు వేధించడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. సీసీఎస్‌, చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌లో తనపై కేసులు నమోదు చేశారని, స్టేషన్‌కు పిలవకుండా పోలీసులను ఆదేశించాలని కోరారు. ఆన్‌లైన్‌లో విచారణ జరిపేలా ఆదేశించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. తీన్మార్‌ మల్లన్న దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు సోమవారం విచారణ జరపనుంది.

సికింద్రాబాద్‌ నార్త్‌జోన్‌ పరిధిలోని చిలకలగూడ ఠాణాలో గురువారం తీన్మార్‌ మల్లన్నను పోలీసులు విచారించారు. తనను తీన్మార్‌ మల్లన్న డబ్బులు డిమాండ్‌ చేసి బెదిరించాడంటూ సీతాఫల్‌మండి డివిజన్‌ మధురానగర్‌ కాలనీకి చెందిన మారుతీ జ్యోతిష్యాలయం నిర్వాహకులు లక్ష్మీకాంత్‌శర్మ ఏప్రిల్‌ 22న చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కేసులో తీన్మార్‌ మల్లన్నను మహంకాళి ఏసీపీ రమేశ్‌, ఇన్‌స్పెక్టర్‌ నరేశ్‌లు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు విచారించారు. ఈ నెల 8న మరోసారి రావాలని చెప్పారు. అనంతరం మల్లన్న విలేకరులతో మాట్లాడుతూ.. ఉంగరాల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న వ్యవస్థపై మాట్లాడినందుకే తనపై కేసు పెట్టారని తెలిపారు. బాధితుడు ఏప్రిల్‌లో ఫిర్యాదు చేసినప్పుడే తనను విచారించాల్సిందని, ఈ నెల 3న నోటీసులిచ్చి.. రెండు రోజుల్లోనే విచారణకు పిలవడం వెనక రాజకీయ కుట్ర ఉందని ఆయన ఆరోపించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని