KCR Delhi Tour: కేంద్ర మంత్రి గడ్కరీతో కేసీఆర్ భేటీ.. 5 అంశాలపై లేఖ

తాజా వార్తలు

Updated : 06/09/2021 21:31 IST

KCR Delhi Tour: కేంద్ర మంత్రి గడ్కరీతో కేసీఆర్ భేటీ.. 5 అంశాలపై లేఖ

దిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిల్లీ పర్యటన కొనసాగుతోంది. దిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్‌ కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో భేటీ అయ్యారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి 5 అంశాలపై లేఖలు అందించారు. విజయవాడ-హైదరాబాద్ హైవేను 6 లేన్లుగా, కల్వకుర్తి-హైదరాబాద్‌ రహదారిని 4 లేన్లుగా విస్తరించాలని కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. శ్రీశైలం రహదారిని విస్తరించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. తెలంగాణలో 1,138 కి.మీ.మేర రోడ్లను అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. అలాగే రీజినల్‌ రింగ్‌రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రిని కోరారు.రాష్ట్రంలో పలు రహదారులకు నిధులపై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. పలు రహదారులను భారత్‌మాల జాబితాలోకి చేర్చడంపై గడ్కరీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. కరీంగనర్‌-వేములవాడ-సిరిసిల్ల-పిట్లం రోడ్డును ఈ జాబితాలో చేర్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే జాతీయ రహదారిగా ప్రకటించి, నిధులు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్‌కు గడ్కరీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని