KRMB: కృష్ణా బోర్డుకు తెలంగాణ ఈఎన్‌సీ లేఖ

తాజా వార్తలు

Published : 05/08/2021 16:14 IST

KRMB: కృష్ణా బోర్డుకు తెలంగాణ ఈఎన్‌సీ లేఖ

హైదరాబాద్‌: కృష్ణా బోర్డుకు తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌ నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం పరిశీలన బృందంలో సీడబ్ల్యూసీ సభ్యుడు దేవేందర్‌రావు ఉండటంపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. దీనిపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం... గతంలో సీడబ్ల్యూసీ సభ్యులపై తాము అభ్యంతరం చెప్పలేదని పేర్కొంది. సీడబ్ల్యూసీ సభ్యుడిపై ఏపీ అభ్యంతరంపై ఈఎన్‌సీ లేఖ ద్వారా నిరసన తెలిపారు.

‘‘తెలంగాణ ప్రాజెక్టుల పరిశీలన బృందంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కె.శ్రీనివాస్‌ ఉన్నారు. గతంలో కె.శ్రీనివాస్‌పై మేము అభ్యంతరం చెప్పలేదు. సీడబ్ల్యూసీ అధికారికి ప్రాంతాలు ఆపాదించడం  అనైతికం. ఎన్జీటీ ఆదేశాలను ఆలస్యం చేయడమే ఏపీ ఉద్దేశం. ఎన్జీటీ ఆదేశాల మేరకు రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను కేఆర్‌ఎంబీ పరిశీలించాలి. రాయలసీమ పనుల పరిశీలనపై ఈనెల 9 లోగా నివేదిక ఇవ్వాలి’’ అని ఈఎన్‌సీ మురళీధర్‌ కృష్ణాబోర్డుకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

జీఆర్‌ఎంబీ ఛైర్మన్‌కు లేఖ
గోదావరి నదీ యాజమాన్యబోర్డు(జీఆర్‌ఎంబీ) ఛైర్మన్‌కు తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌ లేఖ రాశారు. ఈనెల 9న బోర్డు భేటీకి హాజరుకావట్లేదని లేఖలో స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు, ఎన్జీటీలో విచారణ ఉన్నందున భేటీకి రాలేమని వివరించారు. బోర్డు భేటీకి మరో తేదీ ఖరారు చేయాలని కోరారు. వీలైనంత త్వరగా బోర్డును సమావేశపర్చాలని పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని